అజరామరం  హైందవం..!

సకల జీవకోటికి  మూలాధారమై …
అధారమై ,
దారమై …
ధరణి జాగృత 
ప్రమిదై వెలుగుతూ …
వేలజ్యోతుల్ని వెలిగిస్తూ..
అనంతకాంతులతో…
అనాదినుండి …యుగాంతం దాకా..
ఆచంద్రార్కం  
ఆహాస్కరునివలె  
వెలుగుతుంది …
హైందవం ….!!
‘ఆత్మవత్సర్వభూతేషు’  అనిఎలుగెత్తి …
‘పరోపకారర్ధమిధంశరీరం’ అంటూ 
సేవ కోసమే త్యాగం చేసిన 
మహోన్నత మానవత మనది ….
జ్ఞాన కాంతులు విరజిమ్ముతూ …
ధర్మ వింజామరలు వికసిస్తూ….
సత్య శోధనకోసం…
క్షమా, సేవా, త్యాగ
శాంతి సోఫానాలేక్కుతూ …
విశ్వానికి దిశా నిర్దేశం  చేస్తూ …
‘దైవం మానుష రూపేణా’…అంటూ
మనిషిలోనే  ‘మనీషి’ని చూసే …
ఋషే హైందవం ….
‘గంగ’ లో జీవన తరంగాలని ..దర్శిస్తూ..
గంగి’గోవు’లో  మాతను  స్పర్శిస్తూ …
‘ఆర్ష ధర్మ’ ఆదర్శంతో …
అనతమైంది  హైందవం …
పరిమళించే దవనమై 
పరమత సహనమై …
ప్రశాంత ప్రసూనమై …
‘హిందూ’ సాగరమంత …
ఆసేతు హిమాచలమై …
సమస్త జీవన రాగాలకు ప్రాణమై ..
పంచభూతాత్మక దేహమై…
చరాచరమంతా …
అణువణువున   …
చైతన్యం నింపుతుంది ..
హైందవం ….
(ఇంతటి  విలక్షణ , విశిష్ట,  అమృతమయ హైందవ సంస్కృతిని  కాపాడుకుంటే ..మానవ మనుగడ  ఆనంద భరితంగా, విషాదరహితంగా దుక్ఖ రహితంగా సాగుతుంది …)
      
  —– డా .సింహాచలం లక్ష్మణ్ స్వామి ,
                       జగిత్యాల,కరీంనగర్ జిల్లా .
                      Cell no   99 08 28 98 30
      Email   dr.laxmanswamy@gmail.com  

baata saari

అమర స్నేహం !

అమలిన- నిస్వార్థమైన -మాన్వతవిలువలున్న స్నేహ సామ్రాజ్యానికి ….
ముకుళిత హస్తాలతో ప్రియమైన నేస్తాలని ….
హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నాను ……

మానవ సంబంధాలను పునరుజ్జేవింప చేయాలంటే మనిషిలో పేరుకు పోతున్న
రాక్షస విష రక్కసిని తరిమేయాలంటే అమలినమైన అమృత తుల్యమైన
స్నేహ హస్తాలు కావాలి ప్రేమానురాగాలు మమతానుబందాలు మనిషిపై మనిషికి
కనీస విశ్వాసం లేకుండా చేశాయి …ఒకర్నొకరు మోసం చేసుకుంటూ ,ఆత్మ వంచన
చేసుకుంటూ ..యంత్రాల్లా…పిశాచాల్లా….తన శవాన్ని తనే మోస్తూ ….మానవ మృగామవుతున్న
మనిషిలో అంధకార విషరక్కసి కోరల్లోనుంచి …చీకటి గుహల్లోకి… తిమిరం లోకి చోచ్చుకి పోయిన
మనిషి జాడను వెతుకుతూ …చిక్కటి తిమిరాన్ని తరిమేసే ….కార్తీక దీపాల్ని వెలిగిద్దాం !!
ప్రతి స్నేహ ఖరచాలనం కంచు కాగడ కావాలి ……..!!

పవిత్రమైన స్నేహాన్ని ప్రేమ పేరుతో చర బట్టే కామ పిశాచాల్ని తుద ముట్టించాలి ..
స్త్రీ పురుషుల మధ్య పెరిగే స్నేహ సుధలు ప్రేమ పేరుతో కాలకూట విషం కారాదు !!
అసలు పవిత్రమైన స్నేహానికి ఆడా-మగా , చిన్నా -పెద్ద , జాతి ,మతం ,కులం వర్ణం ,వర్గం
అందం -ఆస్తి -హోదాలు ……………ఇవేవి కూడా ఉత్ప్రేరాకాలు కారాదు అసలు వాటి ప్రసక్తే రాకూడదు !
అందుకే నేస్తం ….ఈవిష లోకంలో దిగ్లుపడ్డ దిగాలుగా ఉన్న స్వచ్చమైన …
స్వేచ్చా స్నేహ శ్వేత కపోతాలు ఎగురుతూ ..ప్రపంచమంతా ..స్నేహామ్రుతాల్ని పంచాలి !!
………………………………..మీ స్నేహామృతాల…మైత్రిసుదల ..విరుల సిరిజల్లుల …
————————-సింహాచలం లక్ష్మన్ స్వామి

Welcome to WordPress.com. After you read this, you should delete and write your own post, with a new title above. Or hit Add New on the left (of the admin dashboard) to start a fresh post.

Here are some suggestions for your first post.

  1. You can find new ideas for what to blog about by reading the Daily Post.
  2. Add PressThis to your browser. It creates a new blog post for you about any interesting  page you read on the web.
  3. Make some changes to this page, and then hit preview on the right. You can always preview any post or edit it before you share it to the world.